
సినిమాలు

ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ రావడంతో విశాఖపట్నం పరిశ్రమల కేంద్రంగా మారుతుందని మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్, మంత్రి నారా లోకేశ్ కృషి ఫలితమని చెప్పారు. అమరావతిలో మాట్లాడిన ఆయన, రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఈ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన జరగనుంది. కేంద్ర మంత్రి హెచ్ డీ కుమారస్వామితో పాటు పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా లక్ష మందికి పైగా ఉద్యోగాలు కలుగుతాయి. అలాగే రూ.11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్ట్ నిర్మాణం చేసి మరో 6 వేల ఉద్యోగాలు సృష్టించనున్నారు. దీంతో రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి మరింత పెరుగుతుంది.
.jpg&w=3840&q=75)





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!