

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు భీకర యుద్ధానికి దారితీశాయి. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు చేపట్టగా, దీనికి ప్రతిగా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులకు దిగింది. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరిట జరిగిన ఈ దాడుల్లో ఇరాన్‌లోని పలు కీలక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రముఖ సైనికాధికారులు మృతి చెందినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించినప్పటికీ, అధికారిక ధృవీకరణ లేదు. దక్షిణ ఇరాన్లో పాఠశాలపై బాంబులు పడటంతో పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మొత్తం వందల సంఖ్యలో మరణాలు, గాయాలు సంభవించినట్లు రెడ్ క్రెసెంట్ తెలిపింది.
దాడులకు ప్రతిగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించగా, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుంది. బహ్రెయిన్, ఖతార్, కువైట్, యూఏఈ ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పలు దేశాలు తమ గగనతలాలను మూసివేసి, విమాన సర్వీసులను రద్దు చేశాయి. రెండు పక్షాలు సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు పిలుపునిచ్చాయి. యుద్ధాన్ని విరమించి చర్చలు జరపాలని భారత్ సహా అనేక దేశాలు విజ్ఞప్తి చేశాయి.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!