

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. మూసీ ఆహ్వానం కార్యక్రమంలో మాట్లాడుతూ కొంతమంది అసంపూర్ణ సమాచారం, అర్ధసత్యాలతో ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలపై ఆధిపత్యం చూపేందుకు కాదు, ప్రజలకు సేవ చేయడానికే అధికారాన్ని వినియోగించాలనే నమ్మకంతో ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం తమ బాధ్యతగా భావించామని తెలిపారు.
మానవ నాగరికత నదుల చుట్టూ అభివృద్ధి చెందిందని గుర్తుచేసిన ముఖ్యమంత్రి, 1908 లో మూసీ వరదలు నగరాన్ని ముంచెత్తిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ తరువాత వరద నియంత్రణ కోసం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిర్మించబడినట్లు తెలిపారు. మూసీ పునరుజ్జీవనం ద్వారా నది శుద్ధి మాత్రమే కాకుండా నగరాభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. నది పరివాహక ప్రాంతంలో నివసించే పేదలకు ఇళ్లు, మౌలిక వసతులు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!