

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీజీఎస్ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా 5 వేలకుపైగా ప్రత్యేక బస్సులు నడపాలని ప్రణాళికలు రూపొందించింది. తెలంగాణలోని వివిధ జిల్లాలకు సుమారు 2,500 బస్సులు, ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు 3,000 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. జనవరి 9వ తేదీ నుంచి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయి.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. స్పెషల్ బస్సుల రూట్లు, టైమింగ్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు వెల్లడించారు. పండగ ప్రయాణాల కోసం ముందుగానే ప్రణాళిక వేసుకోవాలని ప్రయాణికులకు అధికారులు సూచిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!