

మొయినాబాద్‌లో జరిగిన సంచలనాత్మక ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసుపై ఈగల్ టీం కీలక ప్రకటన విడుదల చేసింది. నిన్న రాత్రి అందిన సమాచారం మేరకు మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌పై దాడి నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. దాడి సమయంలో పోలీసులు ఫామ్‌హౌస్‌ను పూర్తిగా చుట్టుముట్టి తనిఖీలు నిర్వహించారు. అక్కడి నుంచి డ్రగ్స్ మరియు ఇతర అక్రమ పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ సమయంలో ఓ మహిళతో సహా మొత్తం 11 మంది వ్యక్తులు మద్యం సేవిస్తూ పట్టుబడ్డారని తెలిపారు.
తనిఖీల సమయంలో అక్కడ నార్కోటిక్ పదార్థాల వినియోగం జరిగినట్లు అనుమానం వ్యక్తమైంది. అలాగే తనిఖీలు కొనసాగుతున్న సమయంలో ఫామ్‌హౌస్‌లో నుంచి పోలీసులపైకి కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే పోలీసులు వేగంగా స్పందించి లోపలికి ప్రవేశించి పరిస్థితిని అదుపులోకి తీసుకుని అక్కడ ఉన్న వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!