
రాజకీయాలు

లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై అవిశ్వాస తీర్మానంపై ఇవాళ పార్లమెంట్లో కీలక చర్చ జరగనుంది. ఈ చర్చను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించనున్నారు. చర్చ ముగిసిన తర్వాత హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వనున్నారు. విపక్షాలు ఈ అంశంపై రోజంతా చర్చించాలని కోరగా, కేంద్ర ప్రభుత్వం దీనికి రెండు రోజుల సమయం కేటాయించింది.
ఈ నేపథ్యంలో ఎంపీలు తప్పనిసరిగా సమావేశాలకు హాజరుకావాలని విప్ కూడా జారీ చేశారు. కాంగ్రెస్ సహా మొత్తం 118 మంది విపక్ష సభ్యులు సంతకం చేసిన అవిశ్వాస తీర్మానానికి టీఎంసీ కూడా మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది.
ప్రస్తుతం అధికార ఎన్డీయే కూటమికి లోక్సభలో 293 మంది సభ్యుల బలం ఉంది. ఇక విపక్షాల సంఖ్యా బలం 238 గా ఉంది. అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందాలంటే కనీసం 272 మంది ఎంపీల మద్దతు అవసరం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!