
న్యూస్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్గా స్పందించింది. ఓటర్ల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసి నివేదిక సమర్పించాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీకి ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల సంఘం చర్యలపై జగ్గారెడ్డి స్పందిస్తూ, తాను బీఆర్ఎస్ దొంగ ఓట్ల అంశాన్ని మాత్రమే ప్రస్తావించానని తెలిపారు. ఒక వార్డులో పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నాయని, వాటిని అడ్డుకునే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ కార్యకర్తపై పోలీసుల చర్యల వల్లే గొడవలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. దొంగ ఓట్లు తొలగించడంలో ఎన్నికల అధికారులు విఫలమయ్యారని జగ్గారెడ్డి విమర్శించారు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!