

రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్నేహితురాలైన యువతిని తన ఇంటికి పిలిపించుకుని ఓ వ్యక్తి కిరాతకంగా హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది. విశాఖ పోలీసుల వివరాల ప్రకారం, విజయనగరం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన చింతాడ రవీంద్ర (35) నేవీలో టెక్నీషియన్‌గా పనిచేస్తూ ప్రస్తుతం విశాఖలో నివసిస్తున్నాడు.
ఇటీవల అతని భార్య పుట్టింటికి వెళ్లిన నేపథ్యంలో, విశాఖకు చెందిన తన పరిచయస్తురాలు మౌనిక (29)ను నిన్న రాత్రి తన ఫ్లాట్‌కు పిలిపించుకున్నాడు. అక్కడ ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో రవీంద్ర కత్తితో మౌనికపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
అనంతరం నిందితుడు శరీరాన్ని ముక్కలుగా చేసి కొంత భాగాన్ని ఫ్రిజ్‌లో ఉంచి, మిగతా భాగాన్ని ఇంట్లోనే మూట కట్టి పెట్టినట్లు సమాచారం. ఘటన అనంతరం రవీంద్ర స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!