
న్యూస్

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.45 గంటలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యక్రమాలు, ప్రణాళికలు మరియు అభివృద్ధి అంశాలు ప్రస్తావించబడతాయి. ఈ నెల 20 వ తేదీన రాష్ట్ర బడ్జెట్ను ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
ఈసారి శాసనమండలి సమావేశాలు కొత్త హాల్లో నిర్వహించనున్నారు. అలాగే అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. ఇదే సమయంలో ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే విషయం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!