

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అమెరికా భారీగా ఖర్చు చేస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైన తొలి 24 గంటల్లోనే అమెరికా సుమారు 779 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇది భారత కరెన్సీలో దాదాపు రూ.6,900 కోట్లకు సమానం. సెంటర్ ఫర్ ఎ న్యూ అమెరికన్ సెక్యూరిటీ డేటా ప్రకారం యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వంటి క్యారియర్ స్ట్రైక్ గ్రూపులను ఆపరేట్ చేయడానికి ప్రతిరోజూ భారీ వ్యయం జరుగుతోంది. యుద్ధానికి ముందస్తు సిద్ధతలపైనా పెద్ద మొత్తంలో నిధులు ఖర్చయ్యాయి.
ఎయిర్‌క్రాఫ్ట్‌లు, యుద్ధ నౌకలు, ఇతర సైనిక సామాగ్రి తరలింపునకు అమెరికా సుమారు 630 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.5,556 కోట్లు) వెచ్చించింది. పెన్ వార్టన్ బడ్జెట్ మోడల్ డైరెక్టర్ కెంట్ స్మెట్టర్స్ ప్రకారం యుద్ధం ఇంకా కొనసాగితే మొత్తం ఖర్చు 210 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.18.87 లక్షల కోట్లు) చేరే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా హమాస్‌తో యుద్ధంలో ఉన్న ఇజ్రాయెల్‌కు కూడా అమెరికా భారీ ఆర్థిక సహాయం అందిస్తూ 2023 లోనే 21.7 బిలియన్ డాలర్లు మంజూరు చేసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!