
.webp&w=3840&q=75)
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడం ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. పథకం అమలులో పూర్తిస్థాయి పారదర్శకత కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి దరఖాస్తుదారుడి ఆధార్‌ను ఇతర ప్రభుత్వ డేటాబేస్‌లతో అనుసంధానించి బిల్లులు చెల్లించడం ద్వారా అర్హులైన నిరుపేదలకే లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో టైం టు టైం చెల్లింపులు జరిపి లబ్ధిదారులకు భరోసా ఇస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేసి, రూ.22,500 కోట్లతో నిర్మాణాలు చేపట్టింది. ఇప్పటివరకు 2,48,770 ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 77,334 ఇళ్లు బేస్మెంట్ స్థాయికి, 41,555 గోడల స్థాయికి, 74,561 స్లాబ్ స్థాయికి చేరుకోగా, 2,504 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇందిరమ్మ పథకం కింద ఇప్పటివరకు రూ.3,853.66 కోట్ల బిల్లులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఏప్రిల్ నుంచి రెండో విడత ఇళ్ల కేటాయింపు ప్రారంభం కానుండగా, కేంద్రం వాటా నిధులపై ఈ నెల 16 న ఢిల్లీలో జరగనున్న కీలక సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!