
న్యూస్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన కొత్త టారిఫ్లపై అమెరికాలో రాజకీయ వివాదం మరింత ముదురుతోంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 20కిపైగా రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి.
ఇటీవల సుప్రీంకోర్టు ట్రంప్ విధించిన కొన్ని సుంకాలు రాజ్యాంగానికి విరుద్ధమని తీర్పు ఇచ్చింది. అయితే ఆ నిర్ణయానికి తరువాత ట్రంప్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా దిగుమతులపై కొత్తగా 15 శాతం గ్లోబల్ టారిఫ్లు విధించడం వివాదానికి దారితీసింది.
ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల గవర్నర్లు, అలాగే డెమోక్రటిక్పార్టీకు చెందిన అటార్నీ జనరల్స్ కోర్టులో దావా వేశారు. ప్రజలపై భారంగా మారిన అక్రమ టారిఫ్లను తొలగించాల్సిన సమయంలో వాటిని మళ్లీ అమలు చేయడం సరికాదని డాన్ రేఫీల్డ్, ఒరెగాన్ అటార్నీ జనరల్ వ్యాఖ్యానించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!