

రణవీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ సాధించిన ఘన విజయం యష్ రాజ్ ఫిల్మ్స్‌ను కూడా ఆకట్టుకుంది. ఈ రోజు ఆదిత్య చోప్రా సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ తమ అధికారిక సోషల్ మీడియా ద్వారా దర్శకుడు ఆదిత్య ధర్‌తో పాటు మొత్తం చిత్ర బృందాన్ని అభినందిస్తూ ప్రత్యేక నోట్ విడుదల చేసింది. యష్ రాజ్ సంస్థకు చెందిన జవాన్, పఠాన్, టైగర్ 3 వంటి భారీ హిట్ సినిమాల వసూళ్లను కూడా ధురంధర్ దాటడం విశేషం.

ఈ చిత్రంలో రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, రాజేశ్ బేడి, సారా అర్జున్ తదితరులు నటించారు. గతేడాది డిసెంబర్ 5 న విడుదలైన ఈ సినిమా 33 వ రోజుకు దేశీయ బాక్సాఫీస్‌లో రూ.806.80 కోట్ల నెట్ కలెక్షన్ సాధించి, రూ.800 కోట్ల క్లబ్‌లోకి చేరిన తొలి బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ఛావా, స్త్రీ 2 వంటి పెద్ద హిట్లను కూడా దాటింది.
యష్ రాజ్ ఫిల్మ్స్ తమ నోట్లో ధురంధర్ ఒక సినిమా మాత్రమే కాదని, భారతీయ సినీ చరిత్రలో మైలురాయి అని పేర్కొంది. దర్శకుడు ఆదిత్య ధర్ స్పష్టమైన దృష్టి, ధైర్యమైన కథనం, నాణ్యతపై అంకితభావంతో భారతీయ సినిమాకు కొత్త ప్రమాణం ఏర్పరిచారని ప్రశంసించింది. ప్రస్తుతం ఈ సినిమా పుష్ప 2 హిందీ వెర్షన్ రికార్డును కూడా లక్ష్యంగా పెట్టుకుంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!