

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో హీరోయిన్ కయాదు లోహర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో తనకు అత్యంత కఠినంగా అనిపించిన అంశం ఏదని ప్రశ్నించగా.. శ్రీకాంత్ ఓదెలతో పనిచేయడమే అని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. దర్శకుడు చాలా భిన్నమైన, ఎక్సెంట్రిక్ ఆలోచనలు కలిగిన వ్యక్తి అని, ఆయన పని చేసే విధానం తనకు కొత్త అనుభూతిని ఇచ్చిందని కయాదు పేర్కొన్నారు.
షూటింగ్ సమయంలో దర్శకుడు తనకు ఎన్నో సవాళ్లు విసిరారని, ఒక నటిగా ఆయనను మెప్పించడం అంత సులభం కాదని కయాదు గుర్తుచేసుకున్నారు. అయితే శ్రీకాంత్ ఓదెలలోని అదే విలక్షణత సినిమాకు ప్రత్యేకతను తీసుకొస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆయన విభిన్నమైన ఆలోచనా విధానం, మేకింగ్ స్టైల్ ‘ది ప్యారడైజ్’ను మరో స్థాయికి తీసుకెళ్లే అంశాల్లో ఒకటిగా నిలుస్తుందని కయాదు పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!