
సినిమాలు

రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌లో సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ కొనసాగుతారా లేదా అన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
“పుష్ప 2” సమయంలో సుకుమార్ – దేవిశ్రీ మధ్య కొంత విభేదాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో కొత్త సంగీత దర్శకుడి ఎంపికపై చర్చలు సాగుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ప్రస్తుతం కథ మాత్రమే ఫైనల్ కాగా, కథకు సరిపోయే సంగీతాన్ని అందించే వ్యక్తిని ఎంపిక చేయాలని సుకుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!