

నందమూరి బాలకృష్ణ అతి ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖండ 2 రిలీజ్‌కు ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు డీసెంట్ రెస్పాన్స్ అందుకున్నప్పటికీ పెద్ద స్థాయిలో హైప్ మాత్రం పెంచలేకపోయాయి. దీంతో రేపు (నవంబర్ 21) కర్నాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో విడుదల కానున్న థియేట్రికల్ ట్రైలర్‌పైనే అందరి దృష్టి పడింది. ముఖ్య అతిథిగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ హాజరవుతుండటంతో ట్రైలర్‌పై మరింత ఆసక్తి పెరిగింది. విడుదలకు కేవలం 15 రోజులు మాత్రమే ఉండటంతో ఈ ట్రైలర్ భారీ హంగామా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది.
ఇక ఈ చిత్రపు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు స్టార్ హీరో అల్లు అర్జున్ హాజరవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ ఒకే వేదికపై కనిపిస్తే అఖండ 2 హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది. అభిమానులు బాలకృష్ణ తాండవం ట్రైలర్లో కనువిందు చేస్తుందని ఆశిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, సమ్యుక్త, హర్షాలి మల్హోత్రా ముఖ్య పాత్రల్లో నటించగా, సంగీతం థమన్ అందించారు. డిసెంబరు 5 న పాన్ ఇండియా స్థాయిలో అఖండ 2 గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!