

కోలీవుడ్ నటి మిర్నా మీనన్ తన నటన, అందంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన ఆమెకు 2023లో రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘జైలర్’తో భారీ విజయం దక్కింది. తాజాగా ‘జైలర్ 2’లోనూ తాను నటిస్తున్నట్లు ఓ కార్యక్రమంలో మిర్నా స్వయంగా వెల్లడించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా తొలి భాగంతో తనకున్న అనుభవాలను ఆమె పంచుకున్నారు.
‘జైలర్’లోని ఇంటర్వెల్ సీన్ లాంటి అద్భుతమైన సన్నివేశాన్ని అంతకుముందు తాను ఎప్పుడూ చూడలేదని మిర్నా తెలిపారు. ఇప్పుడు ‘జైలర్ 2’ ఇంటర్వెల్ సీన్ ఎలా ఉండబోతుందో ప్రేక్షకులు ఊహించుకోవాలని అన్నారు. తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్ మరింత భారీగా, మాస్ స్థాయిలో ఉండబోతోందని ఆమె చెప్పిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో, సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎస్.జే. సూర్య, విద్యాబాలన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూర్ణ ప్రత్యేక గీతంలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, అక్టోబర్ 15న చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!