

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. విశ్వక్ సేన్ స్వయంగా కథ అందిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘కల్ట్’. హారర్, థ్రిల్లర్ జానర్లలో ఇప్పటివరకు చూడని వినూత్న కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రమోషనల్ కంటెంట్ ‘కల్ట్’పై క్యూరియాసిటీని మరింత పెంచాయి. ప్రముఖ సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. విశ్వక్ సేన్ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌కు రవి బస్రూర్ అందించే ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోడైతే సినిమా ప్రభావం మరింత పెరుగుతుందని చిత్ర బృందం భావిస్తోంది. తాజాగా ‘కల్ట్’ అధికారిక రిలీజ్ డేట్‌ను సెప్టెంబర్ 19న ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుందనే దానిపై రేపు పూర్తి స్పష్టత రానుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!