

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు రోజులకే విజయ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సూర్య, త్రిష జంటగా నటిస్తున్న ‘కరుప్పు’ చిత్రానికి ఉదయం 9 గంటల ప్రత్యేక షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం కనిపిస్తోంది. ఆర్.జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
గత కొన్ని సంవత్సరాలుగా తమిళనాడులో భారీ హీరోల సినిమాలకు తెల్లవారుజామున షోలకు పరిమితులు ఉండేవి. అయితే ఇప్పుడు విజయ్ ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో మళ్లీ ఫ్యాన్స్ సందడి మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో విజయ్, త్రిష స్నేహంపై సోషల్ మీడియాలో మళ్లీ చర్చ మొదలైంది. ఇటీవల విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి త్రిష హాజరుకావడం కూడా మరోసారి వైరల్‌గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!