
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు తాత్కాలిక ఊరట లభించింది. సిలిండర్ల పంపిణీ సమయంలో ఓటీపీ ధృవీకరణ నుంచి తాత్కాలికంగా మినహాయింపు ఇచ్చారు. విద్యుత్ అంతరాయాలు, మొబైల్ నెట్‌వర్క్ సమస్యల కారణంగా వినియోగదారులు ఓటీపీ పొందడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ తాత్కాలిక వెసులుబాటు ప్రకారం, ఓటీపీ లేకుండానే నగదు చెల్లింపుతో గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో నెట్‌వర్క్ సమస్యలు, విద్యుత్ కోతల కారణంగా సిలిండర్ల డెలివరీలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గి, పంపిణీ ప్రక్రియ సజావుగా సాగుతుందని భావిస్తున్నారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!