
సినిమాలు

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ చిత్రం ‘రౌడీ జనార్దన’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్రామీణ నేపథ్యంలో మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దర్శకుడు రవి కిరణ్ కోలా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొత్త మ్యూజిక్ అప్‌డేట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
మొదట ఈ సినిమాకు క్రిస్టో జేవియర్ సంగీతం అందిస్తున్నట్లు ప్రకటించిన మేకర్స్.. ఇప్పుడు ప్రముఖ సంగీత దర్శకుడు విశాల్ మిశ్రాను కూడా టీమ్‌లోకి తీసుకున్నారని సమాచారం. క్రిస్టో జేవియర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించనుండగా, పాటల బాధ్యతలను విశాల్ మిశ్రా తీసుకున్నారని టాక్. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!