
టెక్నాలజీ

హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా ఇరాన్‌ను హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. 24 గంటల్లోగా హోర్ముజ్ జలసంధి అంతర్జాతీయ నౌకాయానానికి పూర్తిగా తెరిచి ఉంటుందని, వాణిజ్య నౌకలపై ఇకపై ఎలాంటి దాడులు జరగవని ఇరాన్ బహిరంగంగా ప్రకటించాలని వాషింగ్టన్ కోరినట్లు సమాచారం.
ఈ హెచ్చరికను మధ్యవర్తుల ద్వారా ఇరాన్‌కు చేరవేసినట్లు వార్తలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఒమాన్‌లో మధ్యవర్తిత్వ చర్చల్లో పాల్గొననున్నారు. ఈ సమావేశం అనంతరం ఇరాన్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. గడువులోగా స్పష్టమైన హామీ రాకపోతే పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!