
ఒక చిన్న పాప చేసిన సరదా రీల్ ఇటీవల సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఆ వీడియోలో ఆ పాప, విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న పెళ్లికి తనను ఎందుకు పిలవలేదని ముద్దుగా అడిగింది. “పెళ్లికి లడ్డూలు పెడతారు, అన్నదానం కూడా చేస్తారు. మీరు కూడా రీల్స్ చేస్తారు కదా... నేను కూడా రీల్స్ చేస్తున్నాను కదా... నన్ను కూడా పిలవచ్చు కదా?” అని అమాయకంగా చెప్పిన ఆ పాప మాటలు చాలా మందికి నచ్చాయి. ఆమె మాట్లాడిన విధానం, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ కారణంగా ఆ వీడియో వేగంగా వైరల్ అయింది.
ఈ వీడియోను చూసిన విజయ్ దేవరకొండ కూడా స్పందించాడు. ఆ పాపకు ప్రేమగా రిప్లై ఇస్తూ, “బుజ్జి తల్లీ... నిన్ను ఇంటికి లంచ్‌కు పిలుస్తాను. నీకు ఇష్టమైన ఫుడ్, స్వీట్ ఏంటో చెప్పు. ఇంట్లోనే అన్నీ చేయించి మనం బాగా తిందాం” అని చెప్పాడు. విజయ్ ఇచ్చిన ఈ మధురమైన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!