

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మరో కీలక నిర్ణయంతో రాజకీయ చర్చకు కేంద్రబిందువయ్యారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంసను తమిళనాడు ఎంజీఆర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
విజయ్ హీరోగా నటించిన 'స్నేహితుడు', 'బీస్ట్', 'లియో' చిత్రాలకు మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయడంతో ఈ నియామకంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సన్నిహితులకు కీలక పదవులు ఇస్తున్నారని ఆరోపిస్తుండగా, టీవీకే మద్దతుదారులు మాత్రం ఆయన ప్రతిభ, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయమని సమర్థిస్తున్నారు.
ఎంజీఆర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లోనే సినిమాటోగ్రఫీ విద్యను అభ్యసించిన మనోజ్ పరమహంస, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్. సరవణన్ వద్ద సహాయకుడిగా పనిచేసి, 2009లో వచ్చిన 'ఈరం' సినిమాతో స్వతంత్ర సినిమాటోగ్రాఫర్‌గా గుర్తింపు పొందారు. సినీ రంగంలో ఆయనకున్న సాంకేతిక నైపుణ్యం, అనుభవం విద్యార్థులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ నియామకం చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!