

సెన్సార్ బోర్డు అభ్యంతరాల కారణంగా ‘వానర’గా ప్రకటించిన సినిమా టైటిల్‌ను ‘వనవీర’గా మార్చారు. అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్గా, నందు ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. శంతను పత్తి సమర్పణలో, సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్‌పై అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి. అంకిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్, వివేక్ సాగర్ సంగీతం చిత్రానికి ప్రధాన బలంగా నిలవనున్నాయి. మైథలాజికల్ రూరల్ డ్రామాగా తెరకెక్కిన ‘వనవీర’ సినిమా జనవరి 1న న్యూ ఇయర్ స్పెషల్‌గా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.
ఈ ఈవెంట్లో పాల్గొన్న చిత్ర బృంద సభ్యులు సినిమా పై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. నటుడు హర్ష ఈ సినిమా తండ్రి కోసం కొడుకు చేసే పోరాటం కథ అని చెప్పగా, బాబీ ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు యువతను కూడా ఆకట్టుకునే అంశాలు ఇందులో ఉన్నాయని తెలిపారు. డీవోపీ ఛోటా కె. ప్రసాద్ రెండేళ్ల కష్టానికి ఫలితంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందని, కొత్త టైటిల్ ‘వనవీర’ను అందరికీ చేరవేయాలని మీడియాను కోరారు. హీరోయిన్ సిమ్రాన్ చౌదరి ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పారు.
నిర్మాత శంతను పత్తి మాట్లాడుతూ, అన్ని అనుమతులతోనే టైటిల్ రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ సెన్సార్ సూచనలతో చివరి దశలో మార్పు చేయాల్సి వచ్చిందని తెలిపారు. అయినప్పటికీ సినిమా కంటెంట్‌పై పూర్తి విశ్వాసం ఉందన్నారు. అతిథి నిర్మాత రాజేష్ దండా ట్రైలర్లో కనిపించిన సీజీ వర్క్‌ను ప్రశంసిస్తూ, ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని అన్నారు. హీరో–దర్శకుడు అవినాష్ తిరువీధుల మాట్లాడుతూ, చిన్న సినిమాలకు ఇలాంటి చివరి నిమిషం మార్పులు చాలా కష్టంగా మారతాయని, అయినా సెన్సార్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని చెప్పారు. గ్రామీణ నేపథ్యంలో, మైథాలజీ టచ్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరచదని ఆయన స్పష్టంగా తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!