
క్రీడలు

కావేరి జల వివాదంపై డీఎంకే నిర్వహించిన నిరసన సభలో ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రసంగం తమిళ రాజకీయాల్లో తీవ్ర వివాదానికి దారితీసింది. సభలో కొందరు కార్యకర్తలు త్రిష పేరు నినదించగా, ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు ద్వంద్వార్థంగా ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అనంతరం తాను కావేరి నదినే ఉద్దేశించి మాట్లాడానని ఉదయనిధి వివరణ ఇచ్చారు.
అయితే ఆ వివరణతో వివాదం తగ్గలేదు. గాయని చిన్మయి శ్రీపాద, నటి-రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళల గౌరవాన్ని రాజకీయాల్లోకి లాగడం సరికాదని చిన్మయి వ్యాఖ్యానించగా, త్రిషకు బహిరంగంగా ఎలాంటి షరతులు లేకుండా క్షమాపణ చెప్పాలని ఖుష్బూ డిమాండ్ చేశారు. ఈ ఘటన ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!