
గాసిప్స్

టాలీవుడ్లో మరో కొత్త సంచలనం మొదలైంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. థమన్ తన #NewGuyInTown అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఓ రహస్య ట్వీట్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తించారు. “అతను ఎక్కువగా మాట్లాడడు, కానీ అతడి రాకే పెద్ద శబ్దం చేస్తుంది” అన్న వ్యాఖ్యతో ఆయన చేసిన పోస్ట్ సినీ ప్రియులను, ఇండస్ట్రీ వర్గాలను ఆలోచనలో పడేసింది.
కొత్తవారితో తెరకెక్కుతున్న ఓ న్యూ ఏజ్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, ఓ ఫ్రెష్ ముఖం టాలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. ప్రేమ, యాక్షన్ అంశాలతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన వివరాలను చిత్ర యూనిట్ గోప్యంగా ఉంచుతోంది. అయితే డిసెంబర్ 14 న టైటిల్‌తో పాటు చిత్ర గ్లింప్స్ విడుదల చేయనున్నట్టు నిర్మాతలు వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!