

సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ పై హీరోగా, నిర్మాతగా సాయి సింహాద్రి నటించిన చిత్రం ‘సన్ ఆఫ్’. ఈ సినిమాను బత్తుల సతీష్ దర్శకత్వం వహించగా, నిన్న గ్రాండ్‌గా విడుదలైంది. తండ్రి – కొడుకుల మధ్య ఉన్న భావోద్వేగ బంధం నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ విజయాన్ని జరుపుకునేందుకు చిత్ర బృందం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తుమ్మల ప్రసన్నకుమార్, హీరో సాయి సింహాద్రి, హీరోయిన్ మీరా రాజ్, నిర్మాత - డిస్ట్రిబ్యూటర్ శోభారాణి మరియు పలువురు డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు.
తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, “సాయి సింహాద్రి తన తొలి సినిమానే ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా మీద ఆయన ప్యాషన్ నిజంగా అభినందనీయమైంది. భవిష్యత్తులో ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను”, అన్నారు. శోభారాణి మాట్లాడుతూ, “మొదట సాయి ‘సన్ ఆఫ్’ ని ఐదు థియేటర్లలో రిలీజ్ చేద్దాం అన్నాడు. కానీ సినిమా కాన్సెప్ట్ నచ్చడంతో, నేను అందరితో మాట్లాడి దాన్ని దాదాపు 300 థియేటర్లలో విడుదల చేయించాను. తండ్రి - కొడుకుల మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ ఈ సినిమాకు ప్రాణం”, అని తెలిపారు.

సాయి సింహాద్రి మాట్లాడుతూ, “నేను యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్‌గా ఉన్నాను. కానీ సినిమాలపై ఉన్న ఆసక్తి నన్ను ఈ రంగంలోకి తెచ్చింది. ఏడాదిన్నర పాటు కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశాను. నిన్న సినిమా విడుదల కావడం నా జీవితంలో గొప్ప సక్సెస్. నా టీమ్‌కి, ముఖ్యంగా హీరోయిన్ మీరా రాజ్ మరియు శోభారాణిగారికి ధన్యవాదాలు”, అన్నారు. హీరోయిన్ మీరా రాజ్ మాట్లాడుతూ, “తండ్రి - కొడుకుల ఎమోషనల్ బంధం ఉన్న ఈ సినిమాలో మంచి పాత్ర దక్కడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇది నాకొక మంచి గుర్తింపు తీసుకొచ్చింది”, అని చెప్పారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!