

టాలీవుడ్లో మళ్లీ ఓ క్లాసిక్ కాంబినేషన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆదర్శకుటుంబం సినిమా ఇప్పటికే భారీ అంచనాలను సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమాలో వెంకటేశ్ పాత బ్లాక్‌బస్టర్ చిత్రంలోని సూపర్ హిట్ పాటను రీమిక్స్ చేయనున్నారని సమాచారం బయటకు రావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.
ఈ పాటను ఆధునిక బీట్స్‌తో కొత్తగా కంపోజ్ చేస్తున్నారని, అదే సమయంలో ఒరిజినల్ వైబ్‌ను కూడా కాపాడనున్నారని తెలుస్తోంది. వెంకటేశ్ తన పాత స్టైల్‌ను గుర్తు చేసే ప్రత్యేక డాన్స్ మూమెంట్స్‌తో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో పాటల చిత్రీకరణ ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి సినిమాలతో ఈ కాంబినేషన్‌కు మంచి గుర్తింపు ఉంది. చాలా ఏళ్ల తర్వాత వీరి రీయూనియన్ కావడంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!