

యష్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘టాక్సిక్’ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. అయితే విడుదలకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉండగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యం కావడం అభిమానులను నిరాశకు గురిచేసింది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు దక్కించుకున్నారు. టికెట్ ధరల పెంపునకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురుచూపులే బుకింగ్స్ ఆలస్యానికి కారణమని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తాజాగా ‘టాక్సిక్’ బుకింగ్స్ ఓపెన్ చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో చివరి నిమిషం గందరగోళానికి తెరపడుతుందని అభిమానులు భావిస్తున్నారు. ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ తర్వాత యష్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ డార్క్ అండ్ స్టైలిష్ పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో యష్ సరసన నయనతార, కియారా అద్వానీ, హూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!