

చాలా రోజుల తర్వాత టాలీవుడ్‌లో వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఆగస్టులో విడుదలైన పలు ముఖ్య చిత్రాలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటున్నాయి. హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ‘ఇరుముడి’ మంచి విజయాన్ని అందించింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి రెండు రోజుల్లోనే సుమారు రూ.47 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఆదివారం పలు థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించాయి.
మరోవైపు సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ డ్రామా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. మమిత బైజు కథానాయికగా నటించిన ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలిపింది. సూర్య, మమిత నటనతో పాటు వెంకీ అట్లూరి టేకింగ్ కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!