
ఓటీటీ

రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్రానికి థియేటర్లలో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా చూసిన వారు మరోసారి చూసేందుకు థియేటర్లకు వస్తుండగా, ‘మల్లెపూల పల్లకి’ పాటకు ప్రేక్షకులు భారీగా ‘వన్స్ మోర్’ అంటూ కేకలు వేస్తూ డ్యాన్స్ చేస్తున్నారు.
అనేక థియేటర్ల ప్రవేశ ద్వారాల వద్ద అయ్యప్ప స్వామి విగ్రహాలను ఏర్పాటు చేయడంతో భక్తి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తోందని, పలువురు కన్నీళ్లు పెట్టుకున్నట్లు చెబుతున్నారు. ప్రేక్షకుల స్పందనతో ‘ఇరుముడి’ థియేటర్లలో ప్రత్యేక అనుభూతిని కలిగిస్తున్న సినిమాగా నిలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!