

తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు ఐటీ రంగాన్ని విస్తరించాలన్న లక్ష్యంలో భాగంగా ఆదిలాబాద్ ఐటీ టవర్ పూర్తవడం మరో ముందడుగు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌కు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్‌లో ఐటీ పరిశ్రమ విస్తరించేందుకు ఈ టవర్ దోహదపడుతుందని తెలిపారు. త్వరలో ప్రారంభమయ్యే ఈ ఐటీ టవర్ ద్వారా ఆదిలాబాద్, పరిసర ప్రాంతాల యువతకు ఉద్యోగావకాశాలు లభించాలని ఆకాంక్షించారు.
హైదరాబాద్ వెలుపల ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలను తీసుకెళ్లే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరంగల్, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్‌లో ఐటీ టవర్లను ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ తెలిపారు. అయితే వాటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోందని వస్తున్న వార్తలపై స్పందించిన ఆయన, వెంటనే అన్ని సదుపాయాలు కల్పించి కంపెనీలను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!