

వర్సటైల్ యాక్టర్ జగపతిబాబు, లయ ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ సస్పెన్స్ ఫ్యామిలీ థ్రిల్లర్ ‘వదలా’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కుటుంబ బంధాలు, అనుమానం, మానసిక సంఘర్షణలు, మోహం, ఊహించని మలుపులతో ఈ కథ సాగుతుంది. డాక్టర్ యోగి తన భార్య ప్రియ, పిల్లలతో సంతోషంగా జీవిస్తుండగా, ప్రమాదంలో గాయపడిన అముదకు చికిత్స చేయడంతో ఆమె క్రమంగా ఆ కుటుంబానికి దగ్గరవుతుంది. యోగి, ప్రియల అనుబంధాన్ని చూసి అసూయపడిన అముద.. యోగికి సందేశాలు, బహుమతులు, పూలు పంపడం ప్రారంభించడంతో ప్రియకు భర్తపై అనుమానం మొదలవుతుంది.
మరోవైపు పదేళ్ల క్రితం సిలిండర్ పేలుడులో మరణించిన నివాస్ కుటుంబం కేసులో కొత్త ఆధారం లభించడంతో పోలీస్ అధికారి పద్మాకర్ దర్యాప్తు ప్రారంభిస్తాడు. నివాస్ కుటుంబానికి ఏం జరిగింది? అముద యోగి కుటుంబానికి ఎందుకు దగ్గరవుతుంది? ఆమె రాకతో ఆ కుటుంబంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేదే కథ. సినిమా ఒక్కో క్లూతో ఉత్కంఠను పెంచే ప్రయత్నం చేసినప్పటికీ, ఫస్టాఫ్ కొంత నెమ్మదిగా సాగుతుంది. కొన్ని సన్నివేశాల్లో లాజిక్ కంటే డ్రామాకు ప్రాధాన్యం కనిపిస్తుండగా, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ట్రాక్ మరింత బలంగా ఉంటే బాగుండేది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!