

వివిఎస్ క్రియేషన్స్ బ్యానర్‌లో శ్రీరంగం సతీష్ కుమార్ సమర్పణలో రూపొందుతున్న కొత్త చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను నేడు ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రముఖ దర్శక నిర్మాతల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు మరియు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఉపాధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో దర్శక నిర్మాతగా పనిచేసిన నానిరాజ్ చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రాన్ని వివిఎస్ క్రియేషన్స్ నిర్మిస్తోంది.
గత తొమ్మిది సంవత్సరాలుగా అసిస్టెంట్ డైరెక్టర్, రచయితగా, కొన్ని చిత్రాలకు ఘోస్ట్ రైటర్‌గా, షార్ట్ ఫిల్మ్స్ దర్శకుడిగా పనిచేసిన నానిరాజ్ ఈ చిత్రాన్ని కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూత్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. సంగీతంపై మంచి పట్టు ఉన్న ఆయన ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగానూ వ్యవహరిస్తున్నారు. మార్చి మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించి ఏప్రిల్, మే, జూన్ నెలల్లో షెడ్యూల్స్ పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అన్వేష్, సిరి, శ్రీదేవి, సుమన్, జీవా, అజయ్ ఘోష్, ఎల్‌బి శ్రీరామ్, చిత్రమ్ శ్రీను, చత్రపతి శేఖర్, జబర్దస్త్ అప్పారావు, షేకింగ్ శేషు, రవి కుమార్, శ్రీకాంత్, హరీష్, రాజు, జి నారాయణ రావు, సైనిక, హర్ష వర్దిని, మమత, స్నేహ, జగదీశ్వరి, ధనలక్ష్మి రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ ఆత్రేయ డిఓపీగా, శ్రీను ఎడిటర్‌గా, రాక్ నాని మరియు మున్నా కొరియోగ్రాఫర్లుగా, దేవరాజ్ ఫైట్ మాస్టర్‌గా పనిచేస్తున్నారు. త్వరలో చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ప్రకటించనున్నారు.












.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!