

ఈ ఏడాది భారీ అంచనాలతో విడుదలైన కొన్ని పెద్ద సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి. భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో థియేటర్లలోకి వచ్చినప్పటికీ, ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేక కొనుగోలుదారులకు కోట్లలో నష్టాలు మిగిల్చాయి. ఇటీవల వచ్చిన చిత్రాల్లో కార్తీ నటించిన 'సర్దార్ 2' తీవ్ర డిజాస్టర్‌గా నిలిచి ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద ప్లాప్‌గా నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులు రూ. 35 కోట్లకు అమ్ముడవగా, సినిమా కేవలం రూ. 9.25 కోట్లు మాత్రమే వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 8 కోట్లకు హక్కులు కొనుగోలు చేయగా, రూ. 2.50 కోట్ల వసూళ్లే వచ్చాయి.
మరోవైపు కన్నడలో భారీ బిజినెస్ చేసిన 'టాక్సిక్' రూ. 450 కోట్ల థియేట్రికల్ టార్గెట్‌తో విడుదలై, ప్రపంచవ్యాప్తంగా రూ. 160 కోట్ల వద్ద ఆగిపోయింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' హక్కులు రూ. 130 కోట్లకు అమ్ముడవగా, రూ. 60 కోట్ల వసూళ్లతో బయ్యర్లకు నష్టం మిగిల్చింది. రెబల్ స్టార్ ప్రభాస్ 'రాజాసాబ్' రూ. 122 కోట్ల బిజినెస్ చేయగా, రూ. 87 కోట్ల వద్ద క్లోజ్ అయింది. దీంతో ఈ సినిమాలు ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్లకు ఊహించని షాక్ ఇచ్చాయి













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!