
జనరల్

తెలుగు నటుడు, జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్‌కు కొత్త సినిమా షూటింగ్ సమయంలో కుడి భుజానికి గాయమైంది. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు.
ప్రస్తుతం నార్నే నితిన్ కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో వదంతులను నమ్మవద్దని, ఆసుపత్రికి రావద్దని, కుటుంబ సభ్యుల వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కిమ్స్ ఆసుపత్రి వర్గాలు విజ్ఞప్తి చేశాయి. నార్నే నితిన్ మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్, ఆయ్ వంటి సినిమాల్లో నటించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!