

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఆస్తుల విలువ రూ.2,500 కోట్లుగా ఉన్నట్లు హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026 పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఆయన సినీ ప్రయాణం ఆర్థిక సవాళ్ల మధ్య ప్రారంభమైంది. ‘కోయిలా’ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొందని, హృతిక్ తొలి చిత్రం ‘కహో నా.. ప్యార్ హై’ నిర్మాణానికి ఆయన తండ్రి రాకేశ్ రోషన్ ఇంటితో పాటు కార్లను తాకట్టు పెట్టినట్లు పేర్కొన్నారు.
తొలి సినిమా కోసం కుటుంబం ఎదుర్కొన్న ఆర్థికపరమైన రిస్క్ గురించి ఆ తర్వాతే తనకు తెలిసిందని హృతిక్ రోషన్ గతంలో వెల్లడించారు. తన తల్లి ఇంటి, కార్లను తాకట్టు పెట్టిన విషయం చెప్పినప్పుడు పరిస్థితి తీవ్రత తనకు అర్థమైందని ఆయన గుర్తుచేసుకున్నారు. ‘కహో నా.. ప్యార్ హై’ విడుదలైన తర్వాత హృతిక్ స్టార్‌గా ఎదగడంతో ఆయన కెరీర్ కొత్త మలుపు తిరిగింది. ప్రస్తుతం సినిమాలతో పాటు పలు వ్యాపార, బ్రాండ్ పెట్టుబడులు ఆయన సంపదలో భాగంగా ఉన్నట్లు హురున్ జాబితా పేర్కొంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!