

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘ది రాజాసాబ్’ ఒకటి. ఈ సినిమా విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ కామెడీ హార్రర్ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9 న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇక ‘రాజాసాబ్’ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులకు నేటితో తెరపడింది.
హార్రర్ మరియు యాక్షన్ ఎలిమెంట్స్ మేళవింపుతో రూపొందిన ట్రైలర్ గూస్బంప్స్ కలిగిస్తోంది. మిస్టీరియస్ వాతావరణం, భయానకమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కలిసి ట్రైలర్‌కు ప్రత్యేకమైన ఆకర్షణను తీసుకొచ్చాయి. ప్రతి ఫ్రేమ్‌లో ఉత్కంఠను పెంచేలా మేకర్స్ ప్రెజెంటేషన్ ఉంది. ట్రైలర్లో ప్రభాస్ పవర్ఫుల్ ఎంట్రీ ప్రేక్షకులను ఉత్సాహపరుస్తోంది. మాస్ ఎలివేషన్ సీన్స్ ఆయన స్టైల్‌కు తగ్గట్టుగా అదిరిపోయే రేంజ్లో రూపొందించారు. హార్రర్ సన్నివేశాల్లో కనిపించే ఇంటెన్సిటీ, యాక్షన్ ఎపిసోడ్స్‌లో కనిపించే గ్రాండ్ స్కేల్ సినిమా స్థాయిని స్పష్టంగా చూపిస్తోంది. విజువల్స్, VFX ఆకట్టుకునే స్థాయిలో ఉండి సినిమాకు గ్రాండ్ ఫీల్ ఇస్తున్నాయి. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశాన్ని మరింత ఎమోషనల్‌గా, పవర్‌ఫుల్‌గా మార్చుతూ, సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!