

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ జంటను చూసి అభిమానులు మురిసిపోతుంటారు. మూడు దశాబ్దాలకు పైగా వారి వైవాహిక బంధం ఎంతోమందికి ఆదర్శం. అయితే, ఈ బంధం మొదలైన కొత్తలో షారుఖ్ ఖాన్ చాలా పొసెసివ్‌గా ప్రవర్తించేవారని, తన ప్రవర్తనతో గౌరీకి ఇబ్బంది కలిగించారని మీకు తెలుసా? ఈ విషయాన్ని స్వయంగా షారుఖే ఒక పాత ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు.
కొన్నేళ్ల క్రితం ప్రముఖ నటి సిమి గరేవాల్ నిర్వహించిన 'రెండవూ విత్ సిమి గరేవాల్' షోలో షారుఖ్, గౌరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి ప్రేమ ప్రయాణం తొలినాళ్ల గురించి సిమి ప్రస్తావించారు. అప్పుడు షారుఖ్ మాట్లాడుతూ, "ప్రేమలో ఉన్నప్పుడు నేను గౌరీ విషయంలో చాలా పొసెసివ్‌గా ఉండేవాడిని. ఆమె పూర్తిగా నా అదుపాజ్ఞల్లో ఉండాలని భావించేవాడ్ని. నా ప్రవర్తన ఒక కుక్కలా ఉండేది. చాలా నీచంగా, అసహ్యంగా ప్రవర్తించేవాడిని. ఉదాహరణకు, ఆమె జుట్టు విరబోసుకుని తిరగడానికి వీల్లేదు, తెల్ల చొక్కా కూడా వేసుకోకూడదు అని కఠిన ఆంక్షలు విధించేవాడ్ని" అని అప్పటి తన తీరును గుర్తుచేసుకున్నారు.
షారుఖ్ మాటలను గౌరీ ఖాన్ కూడా ధ్రువీకరించారు. ఆయన ప్రవర్తనతో విసిగిపోయి, మారకపోతే విడిచి వెళ్లిపోతానని బెదిరించినట్లు తెలిపారు. "అతని ప్రవర్తన అసహ్యంగా, జబ్బు పడ్డ వాడిలా ఉండేది. నేను 'సరే బై, నిన్ను ఇకపై కలవను' అని చెప్పడంతో అతను మారక తప్పలేదు" అని గౌరీ వివరించారు.
వారి ప్రేమకథ 1984లో ఢిల్లీలో మొదలైంది. ఒక స్నేహితుడి పార్టీలో 18 ఏళ్ల షారుఖ్, 14 ఏళ్ల గౌరీని మొదటిసారి కలిశారు. ఎన్నో ఎత్తుపల్లాల తర్వాత, కుటుంబాలను ఒప్పించి 1991 అక్టోబర్ 25న వివాహం చేసుకున్నారు. ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకుంటూ హిందూ, ముస్లిం సంప్రదాయాల ప్రకారం వారి వివాహం జరిగింది. ప్రస్తుతం ఈ జంటకు ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్, అబ్‌రామ్ ఖాన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. తొలినాళ్లలో ఎన్ని ఇబ్బందులున్నా, వాటన్నింటినీ అధిగమించి నేడు బాలీవుడ్‌లో అత్యంత గౌరవనీయమైన జంటగా నిలిచారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!