
రాజకీయాలు

పోలవరం జిల్లా పరిధిలోని పాపికొండల విహారయాత్రకు మరోసారి తాత్కాలికంగా అంతరాయం ఏర్పడనుంది. తుఫాన్ ప్రభావం నేపథ్యంలో రేపటి నుంచి పాపికొండలకు పర్యాటక బోట్ల రాకపోకలను నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు 16 పర్యాటక బోట్లను తాత్కాలికంగా నిలిపివేస్తూ రంపచోడవరం సబ్‌కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
గోదావరి నదిలో వరదల కారణంగా గతంలోనూ పాపికొండల విహారయాత్ర సుమారు 70 రోజుల పాటు నిలిచిపోయింది. దసరా సెలవుల నేపథ్యంలో రెండు వారాల క్రితమే ఈ యాత్ర తిరిగి ప్రారంభమైంది. అయితే, తాజాగా తుఫాన్ ప్రభావంతో మరోసారి బోట్ల రాకపోకలు నిలిచిపోనున్నాయి. దీంతో పాపికొండలను సందర్శించాలనుకునే పర్యాటకులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!