
రాజకీయాలు

విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 40వ వార్షికోత్సవ వేడుకలు నేడు ఘనంగా నిర్వహించనున్నారు. యూనివర్సిటీ నాలుగు దశాబ్దాల ప్రస్థానాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ కళావేదికలో ‘రూబీ జూబ్లీ’ వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 40 ఏళ్ల ప్రస్థానం, సాధించిన ప్రగతిని వివరించే ప్రత్యేక సావనీర్‌ను ఆవిష్కరించనున్నారు. యూనివర్సిటీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ నిర్వహిస్తున్న ఈ వేడుకలకు ప్రాధాన్యం సంతరించుకుంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!