

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ది ప్యారడైజ్‌పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దసరాతో భారీ విజయాన్ని అందుకున్న శ్రీకాంత్ ఓదెల.. ఈసారి మరింత మాస్, రా అండ్ రస్టిక్ అంశాలతో సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ చిత్రంలో పక్కా తెలంగాణ నాటిజానపద పాట ఉండబోతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలంగాణలోని దావత్‌లు, డీజే కార్యక్రమాల్లో విపరీతంగా వినిపించే ‘ఏశ నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల, మనం ఊగుదమే బాలా..’ పాటను సినిమాలో ఉపయోగిస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీనికి అనిరుధ్ మరింత మాస్ బీట్ అందించినట్లు కూడా వార్తలు వినిపించాయి. దీంతో ఈ పాట కోసం తెలంగాణ జానపద సంగీతాన్ని ఇష్టపడే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ పాటపై చిత్రబృందం అధికారికంగా స్పందించకముందే పాటల రచయిత కాసర్ల శ్యామ్ చేసిన ఓ స్పందన ఆసక్తిని పెంచింది. ‘రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా సెట్ చేశామా?’ అని ఓ అభిమాని అడగగా, కాసర్ల శ్యామ్ స్పందిస్తూ ఈ పాట సినిమాలో ఉందని, అయితే పూర్తి పాట మాత్రం ఉండదని తెలిపారు. అంతేకాదు, కిర్రెక్కించే లిరిక్స్ వేరేగా ఉన్నాయని, నమ్మండి.. నెక్ట్స్ లెవల్ వైబ్ ఉంటుందని చెప్పడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. దీంతో ది ప్యారడైజ్‌లో ఈ జానపద పాటకు సంబంధించిన భాగం ఉండటం దాదాపు ఖాయమనే చర్చ జరుగుతోంది. అనిరుధ్ సంగీతం, శ్రీకాంత్ ఓదెల మాస్ టేకింగ్‌కు ఈ పాట తోడైతే థియేటర్లలో అభిమానుల సందడి ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!