

కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ది ఇండియా స్టోరీ’ చిత్రాన్ని దర్శకుడు చేత్తన్ డి.కె. తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను జూలై 24న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. రైతులు అధిక దిగుబడుల కోసం విస్తృతంగా పురుగుమందులు, రసాయనాలను వినియోగించడం వల్ల కలిగే ఆరోగ్య మరియు పర్యావరణ సమస్యలను ఈ చిత్రంలో ప్రస్తావించనున్నారు.
వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన తాజా పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. పోస్టర్‌లో రైతులు పంటలకు పురుగుమందులు పిచికారీ చేస్తున్న దృశ్యాలను పై నుంచి చూపించడం ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. త్వరలోనే ఈ చిత్ర టీజర్‌ను కూడా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రంలో అశ్విని భాండే, హార్దికా జోషి కీలక పాత్రల్లో నటిస్తుండగా, జీ స్టూడియోస్ మరియు ఎంఐజి ప్రొడక్షన్ సంస్థలు నిర్మిస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!