

తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య రెంట్ విధానం, పర్సంటేజ్ విధానంపై కొనసాగుతున్న వివాదం ఇప్పుడు ‘పెద్ది’ సినిమా విడుదలపై ప్రభావం చూపుతోంది. నిర్మాతలు సింగిల్ స్క్రీన్ థియేటర్లకు రెంట్ మోడల్లోనే చెల్లింపులు చేస్తామని చెబుతుండగా, ఎగ్జిబిటర్లు మాత్రం మల్టీప్లెక్స్‌ల మాదిరిగా పర్సంటేజ్ షేరింగ్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పెద్ది’ సినిమాకు థియేటర్లు ఇవ్వబోమంటూ ఎగ్జిబిటర్లు హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి.
అయితే తర్వాత పరిస్థితి సద్దుమణిగినట్లే కనిపించినా విభేదాలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు ఈ సమస్య పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేశామని చెప్పినా, తాజాగా ఈ వివాదం మెగాస్టార్ చిరంజీవి వద్దకు చేరినట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రం చిరంజీవితో ఎగ్జిబిటర్ల అసోసియేషన్ సమావేశం కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా పర్సంటేజ్ విధానంలోనే ‘పెద్ది’ విడుదల అంశంపై చర్చ జరగనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!