
జనరల్

నటి తమన్నా భాటియా ఆధ్యాత్మికత వైపు మరింతగా అడుగులు వేస్తోంది. సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ కథానాయిక తాజాగా ఉజ్జయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకుంది. తెల్లవారుజామున జరిగే పవిత్ర భస్మ హారతిలో పాల్గొని మహాకాలుడికి ప్రత్యేక పూజలు నిర్వహించింది.
సంప్రదాయబద్ధమైన ఎరుపు చీరలో ఆలయ నియమాలను పాటిస్తూ భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంది. నిర్మాత ప్రజ్ఞా కపూర్‌తో కలిసి ఆలయానికి వచ్చిన తమన్నా, శివుడి పిలుపు వచ్చినప్పుడే ఈ క్షేత్రానికి రావడం సాధ్యమవుతుందని చెప్పింది. స్వామివారి దర్శనం తనకు ఎంతో ప్రశాంతతను, ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చిందని తెలిపింది. ఈ సందర్భంగా తీసిన చిత్రాలు, దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!