
రాజకీయాలు

సాయి దుర్గా తేజ్ ప్రస్తుతం తన భారీ పాన్ ఇండియా చిత్రం ‘SYG (సంబరాల ఏటిగట్టు)’పై పూర్తిగా దృష్టి పెట్టారు. రోహిత్ KP దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హనుమాన్ నిర్మాతలు ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆయన పుట్టినరోజున విడుదలైన “అసుర ఆగమనం” గ్లింప్స్ భారీ రెస్పాన్స్ తెచ్చుకుని సినిమాపై అంచనాలను పెంచింది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక ముంబై షెడ్యూల్ పూర్తి కాగా, ఇందులో ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు కూడా పాల్గొన్నట్లు సమాచారం. అయితే ఆ నటుడి వివరాలను మేకర్స్ గోప్యంగా ఉంచారు. సాయి ధరమ్ తేజ్ కొత్త లుక్‌తో పాటు స్వయంగా స్టంట్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రతి షెడ్యూల్‌తో సినిమా స్థాయి పెరుగుతూ, SYG అతని కెరీర్‌లోనే భారీ ప్రాజెక్ట్‌గా మారుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!