

కోలీవుడ్ నటి స్వాసిక ప్రధాన పాత్రలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా తనదైన ముద్ర వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ‘కరుప్పు’ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఆమె, ప్రస్తుతం విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘వందదేవుళ్లు’ (తమిళంలో ‘నూరుసామి’) విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ‘బిచ్చగాడు’ ఫేమ్ శశి దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ ఆంటోనీ-శశి కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన స్వాసిక, తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న తల్లి పాత్రల ఆఫర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నూరుసామి’లో తల్లి పాత్ర చేసిన తర్వాత తనకు అలాంటి పాత్రల ఆఫర్లు వరుసగా వస్తున్నాయని, అయితే వాటిలో చాలా పాత్రలు కథకు ప్రాధాన్యత లేని సాధారణ పాత్రలేనని పేర్కొన్నారు. కేవలం స్క్రీన్‌పై కనిపించడానికి మాత్రమే ఉండే పాత్రలు చేయడం తనకు ఇష్టం లేదని, కథలో బలమైన ప్రాధాన్యత ఉన్న పాత్రలనే అంగీకరిస్తానని స్పష్టం చేశారు. ఎంత పెద్ద రెమ్యునరేషన్ ఇచ్చినా ప్రాధాన్యత లేని రొటీన్ పాత్రలకు నో చెబుతానని చెప్పడంతో ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!