
రాజకీయాలు

అనంతశ్రీరామ్ చేసిన భూవివాద ఆరోపణలను సూర్యప్రకాశ్ తీవ్రంగా ఖండించారు. పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల గ్రామంలోని ఐదు సెంట్ల భూమిపై అనంత శ్రీరామ్‌కు ఎటువంటి హక్కులేదని స్పష్టం చేశారు. ఈ భూమి తన కుమార్తెకు గిఫ్ట్ రూపంలో వచ్చినదని తెలిపారు.
అనంత శ్రీరామ్ ఆ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని సూర్యప్రకాశ్ ఆరోపించారు. భూమిపై శ్రీరామ్‌కు హక్కు ఉందని నిరూపిస్తే తాను రాజకీయాలు, వ్యాపారాలు వదిలేస్తానని సవాల్ విసిరారు. లేదంటే తన వృత్తిని అనంత శ్రీరామ్ వదులుకుంటారా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!