
క్రీడలు

సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కరుప్పు’ సినిమా తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదల కానుంది. ఇందులో త్రిష హీరోయిన్గా నటించగా, ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు.
యాక్షన్, కామెడీ మేళవింపుతో రూపొందిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రెండు విభిన్న కోణాల్లో కనిపించే పాత్రలో సూర్య తన నటనతో మెప్పించారు. లాయర్ ముసుగులో నేరాలకు పాల్పడే బేబీ కృష్ణ పాత్రలో ఆర్జే బాలాజీ కనిపించగా, అతనికి హీరో ఎలా బుద్ధి చెప్పాడన్నదే సినిమా ప్రధాన కథాంశంగా ట్రైలర్లో చూపించారు. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!